Friday 22 April 2011

చెప్పలేని ఏదో వెలితి...!


తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకితే మైమరచింది నేనేనా?

ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా

వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?

రేకులు రాలుతున్న పూవును చూసి చెక్కిలి జారిన కన్నీరు నాదేనా?

ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీ మనసు చిన్నదయిపోతుందా?

రాత్రి నను పలుకరిస్తూ నా వలపుల కిటికీ లో నవ్వుతూ చంద్రుడు,

వెన్నెల ఊసులెన్నో చెపుతూ, గుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు..!

ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు!

లోకమంతా చీకటి... మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి !

చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజు ఇక నేను చూసేదనా..??



Sunday 10 April 2011

హృదయ సాగరము..


















వలపుల
కిటికిలో కనిపించెను విశాల హృదయ సాగరము..
అందించెను నా మదినలరించే పుష్పగుచ్చెమును..

ఆక్రమించెను నా చిన్ని హృదయమున,
తెలిపెను సముద్ర సోయగాలను..

మది ముంగిట పరిచెను ఆశల హరివిళ్లును..
తీపి తలపుల ఉహల అలలను ఉప్పొంగించెను..

మురిపించెను అలసిన మనసును..
మరిచిపోను ఎన్నటికీ నీ వలపుల మధురిమను.


ఎవరికీ తెలుసు..??


చిరునవ్వు పెదాల వెనక,
చిలిపి ఆలోచనల వెనక,
మదిలోన దాగిన వేదన ఎవరికీ తెలుసు..??

రంగు రంగుల సీతాకోక చిలకకు ఎం తెలుసు
రాగం లేని మూగ వేదన..??

సడి చేసే మువ్వలకేం తెలుసు,
గోల్లుమనే నా మదిలోని గానము..??

తీరం చేరిన నావకేం తెలుసు
సుడిగుండం లోతు ఎంతో..??

కంటిపాపకేం తెలుసు,
జారిన కన్నీటి విలువ..??