Wednesday 2 March 2011

కాలం..!!

కడలి కన్నీరు కార్చునా..??
కనికరం లేని ఎద కరుగునా..??

ఆకాశంలో ఎగిరే పక్షిని
నేలపై నడిపించగలమా..??

వర్ణించమని అడగగలమా,
అందుడికి కళ్ళజోడు అందించి..??

చెక్కెర తీపి చెరుకుగడతో
చలి కాచుకోగలమా..??

చుక్కలలోని చంద్రుడికి
నిచ్చేనవేయగలమా ..??


కనిపించే కలలను కాలానికి వదిలేస్తూ
కాల గమనంలో కలిసిపోవలసిందే...!!!



నన్ను చేరుమా..!!



అలల సోయగంతో అలరించే
నిర్మలమైన సాగర గర్భంలో
దాగిన రహస్యాలెన్నో..
హాయిగా గాలిలో ఎగిరే
ప్రేమ పావురానికి ఎలా తెలుస్తుంది..??

సముద్రంలా మారకు ప్రియతమా...
జంట పక్షిగా నన్ను చేరుమా..!!





నీ అడుగులో అడుగు వేస్తూ నిన్ను చేరాలి అనుకుని
నీ వెంట నడుస్తున్న నా అడుగులు
ఆలోచన సుడిగుండంలో చిక్కి ఆలస్యమయ్యాయి..
నీవు విడిచిన అడుగు జాడలను అలలు తాకి చెరిగిపోయాయి..
నీ అడుగుల జాడలు కనపడక అక్కడే నిలిచాను..
వెనుతిరిగి చూసి చేయి అందిస్తావనే ఆశతో
కన్నీటి కడలి తీరంలో వేచి ఉన్నాను...