కడలి కన్నీరు కార్చునా..??కనికరం లేని ఎద కరుగునా..??
ఆకాశంలో ఎగిరే పక్షిని
నేలపై నడిపించగలమా..??
వర్ణించమని అడగగలమా,
అందుడికి కళ్ళజోడు అందించి..??
చెక్కెర తీపి చెరుకుగడతో
చలి కాచుకోగలమా..??
చుక్కలలోని చంద్రుడికి
నిచ్చేనవేయగలమా ..??
కనిపించే కలలను కాలానికి వదిలేస్తూ
కాల గమనంలో కలిసిపోవలసిందే...!!!

No comments:
Post a Comment