Sunday 15 May 2011

నీలో నిలిచిపోమ్మంటుంది....!!!


నీకై వేచి ఉంటుంది నా మది నా మాట విననంటుంది
నీ ఎదపై వాలమంటుంది నన్ను నన్నుగా నిలవనీయనంటుంది
నీ నుదిటిపై నిలపమంటుంది నా అధర మధుర గురుతులను చెరగనీయ వద్దంటుంది
నీ చెలి నేనే అంటూ నీ చిలిపి తలపులను చెదరనీయ వద్దంటుంది
నీ మమతానురాగం నాదంటూ నీ అనురాగం మౌనరాగమై మిగలవద్దంటుంది
నీ ఆనందమే కోరుకుంటూ నీ ఆశలకు శ్వాసనై నీలో నిలిచిపోమ్మంటుంది
నీ వెచ్చని వొడిలో ఒదిగి నీలో కలిసిపోమ్మంటుంది


Friday 22 April 2011

చెప్పలేని ఏదో వెలితి...!


తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకితే మైమరచింది నేనేనా?

ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా

వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?

రేకులు రాలుతున్న పూవును చూసి చెక్కిలి జారిన కన్నీరు నాదేనా?

ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీ మనసు చిన్నదయిపోతుందా?

రాత్రి నను పలుకరిస్తూ నా వలపుల కిటికీ లో నవ్వుతూ చంద్రుడు,

వెన్నెల ఊసులెన్నో చెపుతూ, గుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు..!

ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు!

లోకమంతా చీకటి... మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి !

చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజు ఇక నేను చూసేదనా..??



Sunday 10 April 2011

హృదయ సాగరము..


















వలపుల
కిటికిలో కనిపించెను విశాల హృదయ సాగరము..
అందించెను నా మదినలరించే పుష్పగుచ్చెమును..

ఆక్రమించెను నా చిన్ని హృదయమున,
తెలిపెను సముద్ర సోయగాలను..

మది ముంగిట పరిచెను ఆశల హరివిళ్లును..
తీపి తలపుల ఉహల అలలను ఉప్పొంగించెను..

మురిపించెను అలసిన మనసును..
మరిచిపోను ఎన్నటికీ నీ వలపుల మధురిమను.


ఎవరికీ తెలుసు..??


చిరునవ్వు పెదాల వెనక,
చిలిపి ఆలోచనల వెనక,
మదిలోన దాగిన వేదన ఎవరికీ తెలుసు..??

రంగు రంగుల సీతాకోక చిలకకు ఎం తెలుసు
రాగం లేని మూగ వేదన..??

సడి చేసే మువ్వలకేం తెలుసు,
గోల్లుమనే నా మదిలోని గానము..??

తీరం చేరిన నావకేం తెలుసు
సుడిగుండం లోతు ఎంతో..??

కంటిపాపకేం తెలుసు,
జారిన కన్నీటి విలువ..??



Wednesday 2 March 2011

కాలం..!!

కడలి కన్నీరు కార్చునా..??
కనికరం లేని ఎద కరుగునా..??

ఆకాశంలో ఎగిరే పక్షిని
నేలపై నడిపించగలమా..??

వర్ణించమని అడగగలమా,
అందుడికి కళ్ళజోడు అందించి..??

చెక్కెర తీపి చెరుకుగడతో
చలి కాచుకోగలమా..??

చుక్కలలోని చంద్రుడికి
నిచ్చేనవేయగలమా ..??


కనిపించే కలలను కాలానికి వదిలేస్తూ
కాల గమనంలో కలిసిపోవలసిందే...!!!



నన్ను చేరుమా..!!



అలల సోయగంతో అలరించే
నిర్మలమైన సాగర గర్భంలో
దాగిన రహస్యాలెన్నో..
హాయిగా గాలిలో ఎగిరే
ప్రేమ పావురానికి ఎలా తెలుస్తుంది..??

సముద్రంలా మారకు ప్రియతమా...
జంట పక్షిగా నన్ను చేరుమా..!!





నీ అడుగులో అడుగు వేస్తూ నిన్ను చేరాలి అనుకుని
నీ వెంట నడుస్తున్న నా అడుగులు
ఆలోచన సుడిగుండంలో చిక్కి ఆలస్యమయ్యాయి..
నీవు విడిచిన అడుగు జాడలను అలలు తాకి చెరిగిపోయాయి..
నీ అడుగుల జాడలు కనపడక అక్కడే నిలిచాను..
వెనుతిరిగి చూసి చేయి అందిస్తావనే ఆశతో
కన్నీటి కడలి తీరంలో వేచి ఉన్నాను...