Saturday, 26 February 2011

నా ఊపిరివి ...!!

నా ఊపిరివి ...!!

నా చిరునవ్వుల వెనక దాగిన కన్నీటి చెరువును
కలల కలువలతో కనిపించనీయక కప్పి ఉంచాను..

నీవు ఏ రాగం పలికినా,
అది మౌనరాగమే అవుతున్నది..

నన్ను నేను మరిచినా
నిన్ను నేను మరవలేను..

నీ తోడు నాకు లేకున్నా
నా మనసుకు నిన్ను దూరం చెయ్యలేను..

మనసులోని ఆశలు యమ పాశాలవుతున్నా,
పంటి బిగువులోని పెదవిలా ఒడిసి పడుతున్నా..

నీ స్పర్శ నన్ను తాకకున్న, నీడవై నా వెంటే ఉన్నావని తెలుసు..
నా ఉపిరివైన నిన్ను వదిలి తుదిశ్వాస విడవటం నాకు తెలియదు..!!!

 

No comments:

Post a Comment