3/6
40)
బాధపడకు నేస్తమా నేనున్నాను,
దూరాన వున్నా మనసుకు తోడున్నాను
కలకాలం వుండవు కష్టాలు కన్నీళ్లు
కలవరపడి తడబడకు కాదు ఏది శాశ్వతము,
కోలుకోవాలి అని కోరుకుంటున్నాను అనుక్షణము...
కలకాలం వుండవు కష్టాలు కన్నీళ్లు
కలవరపడి తడబడకు కాదు ఏది శాశ్వతము,
కోలుకోవాలి అని కోరుకుంటున్నాను అనుక్షణము...
2/6
39)
నా కవితకు రూపానివి నీవు
తొలకరి జల్లు సువాసనవి నీవు
మమతానురాగాల బంధువు నీవు
మమతానురాగాల బంధువు నీవు
సడి చెయ్యని మువ్వవు నీవు
మనసుకు వేసిన విడతీయరాని ముడివి నీవు
సదా ఆనందంగా వుండాలి నీ నవ్వు...
సదా ఆనందంగా వుండాలి నీ నవ్వు...
1/6
38)
వలపులవోడిలో నేను ఒంటరిని,
నా తలపులలో నీవు తుంటరివి,
రేయి పగలు అని చూడక వలచి వచ్చిన సొగసరివి,
పట్టు వదలని నను మించిన గడసరివి...
1/6
37)
విరపూసిన ప్రతి పుష్పము గర్వపడును చేరిన దేవుడి చెంత,
అలంకారమై మురిసి తరించి వీడును చింత,
ఆనందమయమై అందము విరచిమ్మి పొందును గిలిగింత,
వాడిపోతూ కూడా పరిమళాన్ని మిగిల్చటం ఒక వింత.....
36)
కాలం కడలిలో కలిసిపోయే జీవితమ ఎందుకు నీకు ఈ జన్మ...
సాధించాలి అనుకుంటావు అన్ని చివరకు సాధించేదేమిటి...
చీకటి వెలుగుల మద్య సాగిపోతు అవసరమా నీకు ఇన్ని విన్యాసాలు...
కాదేందుకు భూతలస్వర్గము జన్మమెత్తిన ప్రతీ జీవికి..
అదృష్టం దురదృష్టంతో కూడిన అలుపెరుగని ఈ పోరాటం
ఎందుకు నీకెందుకు..????
31/5
35)
ప్రేమ ఒక తీయటి స్వార్థం,
కావాలి అనుకుంటుంది అన్ని తన సొంతం,
కాకపోతే ఎక్కుతుంది బలిపీటం..
ప్రేమ ఒక తీయటి త్యాగం,
పంచుతుంది లేదనక తన సర్వస్వం
చేస్తుంది జీవితంతో మౌనపోరాటం...
ప్రేమ ఒక తీయటి కలల కావ్యం
చూపిస్తుంది తన మధుర ప్రపంచం
నిజమవ్వాలి అనుకుంటుంది ప్రతీ క్షణం.....
:)
ప్రేమ ఒక తీయటి రోగం,
చూపుతుంది తన ప్రతాపం,
తోడేస్తుంది ప్రాణం అస్సలు వుండదు కనికరం :)
34)
పయనించే గాలికి తెలుసా చీకటి వెలుగు,
పరిమళించే పువ్వుకు తెలుసా మంచి చెడు,
గల గల పారే సెలఎరుకు తెలుసా ఎత్తు వంపులు,
మురిపాలోలికే పసిపాపకు తెలుసా ధనిక పేద,
అందరిలో తిరిగే మనిషికి ఎందుకు ఈ కట్టుబాట్లు..??!!
30/5
33)
గమ్యం లేని ఎడారిలా సాగిపోతున్న జీవితంలో
దొరికావు నాకు ఒక ఒయాసిస్ లా ,
సేదదీరుతున్నాను అది గమ్యం కాదని తెలిసి సాగానంపకు నన్ను నీ గమ్యాన్ని వెతుక్కోమని....
32)
నా కవితకు ప్రేరణ నీవు
కావు ఎన్నటికి వేదన నాకు
నా కంటి తీయటి కలవి నీవు
దాహాన్ని తీర్చలేని కన్నీరువు కావు
ఆలోచనల అలవి నీవు
అలజడికి కారణం కావు
అలజడికి కారణం కావు
నా జీవితానికి ఆశవు నీవు
మరణానికి ఎన్నడు మూలం కావు
మరణానికి ఎన్నడు మూలం కావు
29/5
31)
నన్ను నేను మెచ్చుకుంటాను
లోకం నాకు నచ్చనప్పుడు...
నన్ను నేను అద్దంలో చూచుకుంటాను
నా కోణంలో వేరెవరు ఆలోచించనప్పుడు,
నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను బాదిన్చినపుడు..
నాకు నేను శిక్ష విధించుకుంటాను
నేరం నావలన జరిగినప్పుడు..
నా మనసును నేను లేక్కచేయ్యను
అది తప్పు అని నాకు తోచినప్పుడు
28/5
30)
పౌర్ణమి చెంద్రుడు పరిసేను వెన్నెల,
పరవశించి పాడమని ఎదను మీటెను,
కాలం కలిసిరాక మూగబోయెను నా మది,
చూపులకందని చెంద్రుదాయను,
ఇది న్యాయమేనా...??
27/5
29)
కాలానికి తాళం వేయలేము,
పరువానికి కళ్ళెం వేయలేము,
పరుగుతీస్తుంది ప్రతి క్షణం పగలు రేయనక,
పరవశిస్తుంది ప్రణయ గీతమై అలుపెరుగక...
26/5
26)
కంటికి కనపడవు కనులారా చూద్దామంటే,
కమ్మటి కలలలో కడులుతావు మేడులుతావు,
ఊహల ఊయలలో ఊగుతూ మురిపిస్తావు,
మౌన సామ్రాజ్యాన్ని ఎలుతావు ఎదను గిల్లుతావు,
కాదిది నీకు న్యాయము ఓ మనసా నీకు తెలుసా
తీయటి భావన తెలుపలేని ఆరాధన..??!!
25/5
25)
అలిసితిని సోలసితిని,
అనురాగ మాలాలలు అల్లితిని,
ప్రణయ భావాలు పలికితిని,
పైర గాలిలా సాగితిని,
పండుటాకుగా మిగిలితిని,
రాలిపోవుటకు సిద్దముగా వుంటిని కాలం కాకున్నా...
ఇక ఆశలెందుకు రాలిపోయే ఈ ఆకు మీద...???!!
23)
మూగపోయింది వేటూరి పాట, అది తీరని లోటు, తిరిగి రాణి చోటు,
మౌనమేలనోయి అని మౌనాన్ని నిలతీసిన పాటల పండితుడు,
మాటల మహనీయుడు.. జోహార్లు
బాధ పడకు ఓ మిత్రమా నేనున్నా, పాట కాకపోయినా మాటలల
మూటలు కట్టి కవితల రూపంలో నిన్ను మైమరపించాటమే కదా నా పని
22)
మాటల కందని మౌనం మీది,
చూపులకందని చిత్రం అది,
వేదాంతం కాదిది నాలోని వేదన మాత్రమె,
తత్వం కాదిది మీకై నా తపన మాత్రమె...
20)
What is premalekha???
ఎం చెప్పాలో తెలియకుండా మొదలై
ఎం చెప్పినమో తెలియకుండా ముగిసేదే ప్రేమ లేఖ :)
ఎం చెప్పినమో తెలియకుండా ముగిసేదే ప్రేమ లేఖ :)

No comments:
Post a Comment