
ఎలా తెలుపను..??!!
పూర్వజన్మ బంధమేదో నిన్ను నన్ను కలిపింది..
నేను లేకున్నా నువ్వు బ్రతకగలవని తెలుసు..
నువ్వు లేకున్నా బ్రతుకుతాననుకున్నాను నేను..
బ్రతికి సాధించేదేమిటో అని ఆలోచిస్తున్నాను..
క్షణం ఒక యుగమవుతుంది అనుకోలేదు..
మరుజన్మ వరకు వేచి ఉండలేనని ఎలా తెలుపను..
పెదాలు దాటని పదాలతో వారధిని ఎలా కట్టను..
మదిలోనే సమాధి చేస్తూ మరుజన్మకై ఎలా వేచి ఉండను..
ఆవేదన అంబరంలో కన్నీటి చుక్క రాలిపోతుంది..
ఆలోచనల వెల్లువకు మౌనరాగం తోదవుతుంటే,
ఆశతో నిష్క్రమించబోయే నా శ్వాస
జీవిత సమర గీతానికి మరణ మృదంగం అవుతున్నది..!!

No comments:
Post a Comment