22/5/10
19)
కనుల కన్నా కను సైగ గొప్పది,
మాట కన్నా మౌనం గొప్పది,
ప్రేమ కన్నా మనసు గొప్పది,
మనసు కన్నా నమ్మకం గొప్పది...
18)
వర్షానికి ఏడవటం తెలుసు కాని నవ్వటం తెలియదు..
సూర్యుడికి మండించటం తెలుసు కాని ఆర్పటం తెలియదు,
17)
ప్రియతమ నీవచట కుశలమా నీనిచట కుశలమే,
కమ్మని ఈ ప్రేమలేకలే రాసింది హృదయమే,
ఊహలన్ని పాటలే కనుల కోటలో,
తొలి కలల కవితలే మాట మాటలో ....
16)
జీవితంలో విరపూయును పువ్వులు ఎన్నో,
కావు కదా అన్నీప్రేమ కుసుమాలు,
కనుక్కోవాలి వాటి జాడలను,
జారనీయకూడదు జవరాల నవ్వుల పువ్వులను,
కావాలి జీవిత పయనము ఆనందపు జల్లుల జడివానలో నిండు నూరేళ్ళు,
ఇందులో సఫలీకృతులు అవుదురు అందరిలో కొందరు....!!!!
15)
కాదనరంగమున కాలు పెట్టిన యుద్ద వీరుడికి
వెనుతిరుగుట కాదు క్షత్రియ ధర్మము ,
గెలుపు ఓటమిలు కానేరవు తుది నిర్ణయము ,
ముందుకు సాగుటయే వీరుడి లక్షణము,
విజయమో వీర స్వర్గమో అనునది అతనికి శోభాయమానము .. :)
14)
గోరువెచ్చటి సురీదమ్మ, పోద్దుపోడుపులో వచాదమ్మ,
వద్దన్నా రావద్దన్నా గుండెలో గుడిసె వేసి
అది గుడిగా చేసి ఆ గుడిలో దాగున్నదమ్మ...
13)
మనసా తెలుసుకోలేవా మదిలో ఉన్న తీయని ఆశలను,
చిరుదరహాసము వెనక ఉన్నవెచ్చటి ఆశ్రువులను,
వేదనల వెనక ఉన్న రోదనలను,
తెలిపేది ఎలా నీకు అటు ఇటు కాని ఓ మనసా...??!!
12)
ఎవరు నీవు?? నాకు ఎలా దొరికావు?? ఎందుకు దొరికావు??
ఏమిటి మన మద్యవున్న బంధము??
మనము ప్రేమికులమా, కామికులమా, పనికి రాని పోకిరీలమా?
ఏమనుకోవాలి????
అన్నింటిలో శాశ్వత బందానికే నా ఓటు.
అందులో మొదటిది 'స్నేహ బంధము'.......
11)
మనసా ఎందుకు ఈ ఆనందం, ఆరాటం,
ఏమిటి ఈ తెలియని అమాయకత్వం,
ఏ మదికి అర్థమగునో నీ మనస్తత్వం....
10)
మనసా ప్రేమంటే తెలుసుకో,
జీవితాన్ని ఆనందంగా మలుచుకో,
మదిలోని భావనలను అర్థం చేసుకో,
నీకు నచ్చిన వారి హృదయాన నిలిచిపో,
నీ మది మేచిన వారి ప్రేమను ఎప్పటికైనా అందుకో....!!
9)
జాలువారెను కవితా కుసుమాలు మీ మదిని దోచుతకే కదా......!!!!
8)
కలిసెను కవి హృదయాలు,
మెరిసేను ఆకాశము,
మురిసేను మనసు,
తేలియాడెను గాలిలో అది పెనుగాలి అని కూడా మరచి
7)
ఆశల మాటలను మూటలుగా చేసి కవితల రూపంలో మీ మదిని దోచితిని
6)
సూర్యుడిని చూడలేము ప్రకశించునప్పుడు,
ఎందుకు కనపడును సుందరముగా సూర్యుడు సుర్యాస్తమయమున,
వెళ్లి పోతాడు అని తెలిసి ఎందుకు ఈ పులకింత.....???!!
5)
ఆశల కడలిలో ఉసులాడే మనసుకు,
అలుపెరుగని తోడు దొరికితే,
ఉరకలు వేయదా పరువము ఆనంద కేరింతలతో...!!!
4)
మదిలోని ఆశలకు మాటలు వస్తే,
తీయనైన పాటలతో రాతినైన కరిగించునేమో కదా....!!!!
3)
కవి రాజు మనసు ఎన్నటికీ తెలియదు,
పలుకుతాడు ఉసులు ఎన్నో బాసలు మదిని పులకిన్చుటకు,
కానరావు మార్గాలు, తీరవు ఈ వేదనలు,
ఇంతేనా ఇక ఇంతేనా మనసుకు తనువుకు పగ్గాలు వేయక తప్పదా, ఇంతేనా ఇక ఇంతేనా.....????!!!
2)
కవిత కవితకే ఒక కవిత కావాలని కోరుకునే కవి కాని కవిని కలవాలని
కలకాలం కోరుకుని కలలో నివసిస్తూ కాలం కడలిలో కలిసిపోవుటకు సిద్దమైన
కవి కాని కవయిత్రిని నేను కలవరపడుతున్నా కనికరం లేకపోవటం ఎంత దురదృష్టకరం...... :(
5 / 5 / 2010
1)
మధువులోలికే మాధవి ని మాధనపెట్టిన మధన మోహనుడు ఎలా నిద్రించున్...
వడి వడిగ ఎగసే మనసుకు పగ్గాలు వేయలేక విరిగిన మదిని
మొహించకురా సుందర వాదనా....!!!

No comments:
Post a Comment